తన పెళ్లంటూ వస్తున్న వార్తలపై అల్లు శిరీష్ క్లారిటీ...
Send us your feedback to audioarticles@vaarta.com
త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి జరగనుందంటూ ప్రచారం జోరుగా సాగింది. దీనికి కారణం లేకపోలేదు.. సుప్రీం హీరో సాయితేజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం బాగా వైరల్ అయింది. మెగా అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. వచ్చే ఏడాది అల్లు శిరీష్ కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడహో... అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి యూట్యూబ్ ఛానళ్ల వరకూ వార్తా కథనాలు ప్రచురించాయి. దీంతో అల్లు శిరీష్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. అది నిజమేనా? లవ్ మ్యారేజా.. లేదంటే అరేంజ్డ్ మ్యారేజా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.
ఇంక ఉపేక్షిస్తే లాభం లేదు అనుకున్నాడో ఏమో కానీ.. దీనిపై తాజాగా అల్లు శిరీష్ స్పందించాడు. తన పెళ్లి ఇప్పట్లో ఉండే అవకాశమే లేదని స్పష్టం చేశాడు. తేజూ సరదాగా జోక్ చేసి ఉంటాడని.. మీరు దాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటారని తేల్చేశాడు. ‘‘తేజూ సరదాగా జోక్ చేసి ఉంటాడు. మీరు దానిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. పెళ్లి విషయంలో మా పేరెంట్స్ నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అన్ని విషయాలూ నేనే చెబుతా’’ అని అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు.
కాగా.. సాయితేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే.. ‘‘శిరీష్ నాకంటే పెద్ద. తను వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుంటాడు. ఇంటి పెద్ద కొడుకుగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. వాటిని పూర్తి చేయాలి. అయితే పెళ్లి చేసుకోవడం కంటే నాకు సోలోగా ఉంటేనే సంతోషం. చిన్నప్పటి నుంచి చాలా మిస్ అయ్యాను. ఎన్నో కలలున్నాయి. ముందుగా వాటన్నింటినీ నెరవేర్చుకోవాలి’’ అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ అవడంతో అల్లు శిరీష్ పెళ్లి బ్యానర్ ఐటెమ్‌గా మారిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments