సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎనౌన్స్ చేసిన అల్లు శిరీష్..!
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో ఇటీవల విజయం సాధించిన అల్లు శిరీష్ తన నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేసాడు. అయితే...నూతన దర్శకుడు మల్లిడి వేణు దర్శకత్వంలో అల్లు శిరీష్ గతంలో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. ఈ న్యూస్ చెప్పిన రెండు రోజుల్లోనే దసరా కానుకగా తన నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేసాడు.
డైరెక్టర్ వి.ఆనంద్ తో సైన్స్ ఫిక్సన్ థ్రిల్లర్ చేస్తున్నాను అంటూ అల్లు శిరీష్ ట్విట్టర్ లో ఎనౌన్స్ చేసారు. సందీప్ కిషన్ తో టైగర్ సినిమాని తెరకెక్కించిన వి.ఆనంద్ నిఖిల్ హీరోగా ఎక్కడికిపోతావు చిన్నవాడా అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియకుండానే అల్లు శిరీష్ ఆనంద్ తో సినిమా చేయనున్నాను అని ప్రకటించేసాడు. మరి...వేణు మల్లిడి తో సినిమా ప్రారంభించినట్టుగా ఈ సినిమాని ఎనౌన్స్ మెంట్ కే పరిమితం చేస్తాడో....సెట్స్ పైకి తీసుకువెళతాడో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments