శిరీష్ న‌మ్మ‌కం.. డేట్ ఫిక్స్‌

  • IndiaGlitz, [Thursday,October 11 2018]

మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు వారి హీరో శిరీష్ ప్ర‌స్తుతం మల‌యాళ చిత్రం ఏబీసీడీని అదే పేరుతోతెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధుర శ్రీధ‌ర్, య‌ష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఉన్న‌ట్లుండి ఫిబ్ర‌వ‌రి 8న సినిమా విడుద‌ల‌వుతుందని.. ఈ సినిమా విడుద‌ల తేదినీ శిరీష్ అధికారికంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. 'నేను క‌న్‌ప్యూజింగ్ దేశినే .. అయితే ఫిబ్ర‌వ‌రి 8న నా సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది' అంటూ ట్వీట్ చేశారు శిరీష్‌. ఈ సినిమాలో శిరీష్ స్నేహితుడి పాత్ర‌లో భ‌ర‌త్ (ఢీ, రెడీ, దేనికైనా రెడీ చిత్రాల్లో న‌టించిన బాల‌న‌టుడు) ఫుల్ లెంగ్త్ రోల్‌లో న‌టిస్తున్నారు.

More News

'బాహుబ‌లి' ఫార్ములాతోనే...

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి `బాహుబ‌లి` త‌ర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చ‌రణ్‌ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌బోయే ఈ సినిమాకు...

విజ‌య్ దేవ‌ర‌పై నిఖిల్ ట్వీట్‌.. తొల‌గింపు

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న నోటా సినిమా పోయింది.. పండ‌గ చేసుకునేవాళ్లు ఇప్పుడే పండ‌గ చేసుకోసుకోండి. ఐ యామ్ బ్యాక్ అంటూ ఓ మెసేజ్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

'ఐరా'గా న‌య‌న‌తార‌

ప్ర‌స్తుతం లేడీ సూప‌ర్‌స్టార్‌గా సౌత్‌లో నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో ఉంది న‌య‌న‌తార‌. ఈమె న‌టించిన చిత్రాలు త‌మిళంలో అగ్ర హీరోల చిత్రాల రేంజ్‌లో ఆద‌ర‌ణ పొందుతుండ‌టం విశేషం.

తాప్సీ 'గేమ్ ఓవ‌ర్‌'

ద‌క్షిణాదిలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ త‌ర్వాత `బేబి, నామ్ ష‌బానా, పింక్‌, జుడ్వా 2` చిత్రాల‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షురూ..

టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్ళి త‌ర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది.. నాగ చైతన్య 17 వ సినిమాగా తెరకెక్కుతున్న...