అల్లు అర్జున్‌ని అలా చూపించనున్న కొరటాల!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా తర్వాత వెంటనే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బన్నీ మరో సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నారని టాక్. ప్రస్తుతం బన్నీ కోసం కొరటాల శివ ఓ కథను సిద్ధం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అల్లు అర్జున్ కాలేజ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తారట. సాధారణంగా తన సినిమాల్లో కమర్షియల్ అంశాలతో పాటు ఓ మెసేజ్‌ను ఇచ్చే దర్శకుడు కొరటాల శివ బన్నీతో ఎలాంటి మెసేజ్ ఇప్పించనున్నారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకున్న బన్నీ పుష్ప సినిమాను అనౌన్స్ చేశారు. శేషాచల అడవుల్లో జరిగేఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారట. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. బన్నీ సుక్కు కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com