అల్లు అర్జున్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సినిమా "నా పేరు సూర్య" విడుదలై ఇప్పటికే నాలుగు నెలలు కావస్తున్నా తన తదుపరి సినిమాను ఎవరితో చేయనున్నాడనేది కన్ఫర్మ్ కాలేదు. అయితే ఆ మధ్య 'ఇష్క్' '24' 'మనం' చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యిందట. ఈ విషయాన్నీ గీత ఆర్ట్స్ బ్యానర్ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట .
దర్శకుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ రేపు నవంబర్ 7న ప్రకటన చేయనున్నారట. అయితే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపు రేపే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారనేది కూడా తెలియనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "జులాయి" "సన్నాఫ్ సత్యమూర్తి" చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దింతో ఇప్పుడు ఈ ఇద్దరు హైట్రిక్ హిట్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మేకర్స్ ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com