అల్లు అర్జున్ "ఏషియన్ సత్యం" థియేటర్ ఓపెనింగ్ డేట్స్ ఫిక్స్.. శ్రీరాముడి ఆశీర్వాదాలతోనే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తమ ముందు తరాల వారిని చూశారో.. లేక వ్యక్తిగత అనుభవమో కానీ ప్రస్తుతం సినీ పరిశ్రమలో వున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు డబ్బును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వైపు సినిమాల్లో వుంటూనే బ్రాండ్ ఎండార్స్మెంట్స్, వ్యాపారాలతో దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. ఒకరిని చూసి మరొకరు జాగ్రత్త పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, మహేశ్‌బాబు, విజయ్ దేవరకొండలు ఈ లిస్ట్‌లో అందరికంటే ముందే వున్నారు.
సత్యం పేరును కొనసాగిస్తూనే:
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టారు. దీనిలో భాగంగా ఏషియన్ అల్లు పేరిట హైదరాబాద్ అమీర్‌పేటలో భారీ మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఓపెనింగ్‌కి ముస్తాబైంది. అమీర్‌పేటలోని సత్యం థియేటర్ సినీ ప్రేక్షకులకు, ప్రజలకు సుపరిచితం. దీనిని కొనుగోలు చేసిన బన్నీ.. ఏషియన్ గ్రూప్‌తో కలిసి అత్యాధునిక హంగులతో ముస్తాబు చేస్తున్నారు. అలాగే సత్యం బ్రాండ్ వాల్యూ పోకుండా ఆ పేరునే కొనసాగిస్తూ ‘‘ఏషియన్ సత్యం’’తోనే మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు అల్లు అర్జున్.
ఆదిపురుష్ రిలీజ్ రోజే ముహూర్తం:
అయితే ఈ థియేటర్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో వస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏషియన్ సత్యం ప్రారంభోత్సవానికి సంబంధించి ఫిలింనగర్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీని ప్రకారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘‘ఆదిపురుష్’’ సినిమాతో అల్లు అర్జున్ థియేటర్ ఓపెన్ కానుందంట. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో థియేటర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బన్నీ నటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments