అల్లుఅర్జున్ తో రష్మిక మండన్న
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడంలో సూపర్‌హిట్ అయిన కిరిక్ పార్టీ తో రష్మిక మండన్న పేరు మారు మోగింది. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతల కన్ను పడటంతో రష్మిక తెలుగు సినిమాల్లోనూ బిజీ బిజీగా ఉంది. తెలుగులో నాగశౌర్యతో ఓ సినిమా, రామ్‌తో ఓసినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు ఈసారి ఏకంగా కన్నడ భామ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్ని హీరోగా లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించనున్న సినిమా `నా పేరు శివ నా ఇల్లు ఇండియా` సినిమాలో బన్ని పక్కన నటించడానికి నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే బన్ని పక్కన హీరోయిన్ ఎవరనేది తేలిపోతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com