లేడీ డాన్స్ మాస్టర్ తో బన్నీ

  • IndiaGlitz, [Saturday,December 02 2017]

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి యువ క‌థానాయ‌కుల్లో బ‌న్నికి ఓ సెప‌రేట్ గుర్తింపు ఉంది. అదే డ్యాన్స్ బాగా చేస్తాడ‌ని. అందుకు త‌గిన‌ట్టు బ‌న్ని కూడా త‌న సినిమాల్లో డ్యాన్సులు ప్ర‌త్యేకంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు బ‌న్ని న‌టిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య‌'. ఈ సినిమాను వ‌క్కంతం వంశీ న‌టిస్తున్నాడు.

ఈ చిత్రంలో బ‌న్ని ఆర్మీ అధికారిగా న‌టిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో డ్యాన్సుల విష‌యంలో బ‌న్ని స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. అందుక‌ని జాతీయ స్థాయిలో కొరియోగ్రాప‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైభ‌వి మ‌ర్చంట్‌తో క‌లిసి బ‌న్ని ప‌నిచేయ‌బోతున్నాడ‌ట‌.

డోల్ భాజే, హ‌మ్మ హ‌మ్మ వంటి రీమిక్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన వైభ‌వి మ‌ర్చంట్ బ‌న్నితో ఎలా స్టెప్పులేయించ‌నుందో మ‌రి. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

జెనీలియా రీ ఎంట్రీ...

బాయ్స్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన జెనీలియాకు తెలుగు, త‌మిళంలో మంచి పేరు తెచ్చిన సినిమా 'బొమ్మ‌రిల్లు'.  హ హ హాసినిగా జెనీలియా ఇంకా గుర్తుంది.

సాయిధరమ్ తేజ్ తో పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే - ప్రసన్న

'జవాన్' సినిమాలో కేశవ అనే క్యారెక్టర్ కోసం రవిగారు కొత్త నటుడు కావాలని వెతుకుతున్నప్పుడు రచయితలు గోపీమోహన్, కోన వెంకట్ లు నా పేరును రవికి చెప్పారు.

డిసెంబర్ 28న 'ఒక్క క్షణం' ?

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ రూపొందించిన ఈ సినిమా మంచి కథా కథనంతో ఆసక్తిగా ఉంటుందని వినికిడి.

శ్రీపతి కర్రి దర్శకత్వంలో వస్తున్న'హల్ చల్' ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీపతి కర్రి దర్శకత్వంలో గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం హల్ చల్. రద్రాక్ష్ ఉత్కమ్, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తున్నారు.

డ‌బ్బింగ్ చెప్పుకుంటోన్న బాల‌య్య హీరోయిన్‌...

ఇప్పుడు తారామ‌ణులంద‌రూ సొంత గొంతుక‌తో డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. రాశిఖ‌న్నాలాంటి కొంద‌రు హీరోయిన్స్ అయితే ఏకంగా పాట‌లు కూడా పాడేస్తున్నారు.