ఇంట్రెస్టింగ్ టైటిల్ తో అల్లుఅర్జున్...

  • IndiaGlitz, [Friday,February 10 2017]

స్ట‌యిలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో సినిమా డిజె.దువ్వాడ జ‌గన్నాథ‌మ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ వేస‌విలో విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా త‌ర్వాత అల్లుఅర్జున్ రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. అందులో ఒక‌టి వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో కాగా, మ‌రొక‌టి లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ద్విభాషా చిత్రం. వంశీ పైడిప‌ల్లి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ సినిమాకు నా పేరు శివ‌..మ‌న వూరు ఇండియా అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే ఈ సినిమా లింగుస్వామి సినిమా కంటే ముందుగానే ప్రారంభమ‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.