న్యూ టాలెంట్‌తో బన్నీ?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. కొత్త దర్శకులతో పనిచేసిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. తన రెండో చిత్రం ఆర్య కోసం సుకుమార్ కి దర్శకుడిగా తొలి ఛాన్స్ ఇచ్చిన ఆయన.. ఆ తరువాత మళ్లీ 13 ఏళ్ల తరువాత రైటర్ వక్కంతం వంశీకి దర్శకుడిగా మొదటి అవకాశమిచ్చాడు. నా పేరు సూర్య అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. వక్కంతం వంశీకే కాకుండా మరో కొత్త డైరెక్టర్‌కి కూడా బన్నీ అవకాశమివ్వనున్నాడని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోయే ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.
కాగా, ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలోనూ బన్నీ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com