'జయదేవ్'తో గంటా రవికి గ్రేట్ ఫ్యూచర్ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
Send us your feedback to audioarticles@vaarta.com
గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ మాళవికా రాజ్ హీరోయిన్గా డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత కె.అశోక్‌కుమార్ నిర్మించిన చిత్రం 'జయదేవ్'. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రీసెంట్గా విడుదలై సంగీత ప్రియులను అలరిస్తూ ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్‌ను సాధించింది. కాగా ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకని జూన్ 28న వైజాగ్ నోవాటెల్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, హీరో గంటా రవి, హీరోయిన్ మాళవికా రాజ్, దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాతల మండలి కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు, ప్రముఖ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి, స్టార్ మేకర్ సత్యానంద్, ఎంపిలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్, రవీందర్, ఎమ్మెల్యేలు రమేష్‌బాబు, అనిత, గణేష్‌బాబు, గణేష్‌కుమార్, ఎ.పి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, శ్రీమతి శారద పాల్గొన్నారు. అభిమానుల కోలాహలం మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ''నా వందో చిత్రం 'గంగోత్రి'లో హీరో అల్లు అర్జున్ అని అప్పుడే డిసైడ్ చేశాను. అప్పుడు వట్టి 'ఎ'.. ఇప్పుడు 'ఎ.ఎ.' బన్నీ స్టార్ అవడం నాకు చాలా గర్వంగా వుంది. గుళ్లోకి వెళ్లినప్పుడు మనం జయ జరగాలని గంట కొడతాం. గంటా శ్రీనివాసరావుగారికి అన్నింట్లో జయమే. ఆయన ఇంటిపేరులోనే విజయం వుంది. ఈ సినిమా టైటిల్లో జయం వుంది. డైరెక్టర్ పేరులో జయం వుంది. ఇంతకన్నా ఈ సినిమాకి ఇంకేం కావాలి. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ - ''గంటా శ్రీనివాసరావుగారితో పర్సనల్‌గా, పొలిటికల్‌గా చాలా లాంగ్ జర్నీ వుంది. చిరంజీవిగారికి శ్రీనివాసరావుగారంటే ఎంతో ఇష్టం. అదే ఇష్టం నాకు శ్రీనివాసరావుగార్ని ఇంకా ఎక్కువ ఇష్టపడేలా చేసింది. అలాగే మా ఫాదర్‌కి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన కోసం ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా వుంది. గంటా రవికి గ్రేట్ ఫ్యూచర్ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయంత్గారు ఎన్నో సూపర్‌హిట్ మూవీస్ తీశారు. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు అందరితో వర్క్ చేశారు ఆయన. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''విశాఖపట్నం అంటే సెంటిమెంట్‌గా మాకు చాలా ఇష్టం. 'మౌనపోరాటం', 'కర్తవ్యం', 'మనసంతా నువ్వే' వంటి అద్భుతమైన సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసాం. గంటా రవి పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ ద్వారా 'జయదేవ్'తో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ చిత్రంలో కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాను. గంటా రవి పెర్ఫార్మెన్స్ చూశాను. అతనిలో అద్భుతమైన నటుడు వున్నాడు. అశోక్‌కుమార్ నిర్మించిన అన్ని చిత్రాలకు వర్క్ చేశాం. అన్ని బాగా ఆడాయి. ప్రభాస్ ఫస్ట్ సినిమా 'ఈశ్వర్'కి కూడా మేము వర్క్ చేశాం. ప్రభాస్ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు. అలాగే గంటా రవి కూడా గొప్ప స్టార్ అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను. కెమెరామెన్ జవహార్‌రెడ్డి, మణిశర్మ అందరూ పోటీపడి ఈ సినిమాకి వర్క్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా సూపర్‌హిట్ అయి గంటా రవి చిరంజీవిగారంత గొప్ప నటుడు కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
హీరో గంటా రవి మాట్లాడుతూ - ''మా పేరెంట్స్‌కి నా కృతజ్ఞతలు. ఈ స్టేజీ మీద వున్నానంటే దానికి ముఖ్య కారణం మా నాన్న, అమ్మ. నా 'జయదేవ్' టీమ్‌ని బ్లెస్ చేయడానికి వచ్చిన అల్లు అర్జున్ అన్నయ్యకి చాలా థాంక్స్. తమిళంలో సూపర్‌హిట్ అయిన 'సేతుపతి' చిత్రాన్ని తెలుగులో ఎన్నో మార్పులు చేసి పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. అశోక్‌కుమార్‌గారు నన్ను నమ్మి ఈ సినిమా నాతో చేశారు. జయంత్గారు నాతో సినిమా చేస్తారో లేదోనని చాలా భయపడ్డాను. నన్ను ఆయన బిలీవ్ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మణిశర్మగారు ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. జవహార్రెడ్డిగారి విజువల్స్ సినిమాకి చాలా ప్లస్ అవుతాయి. ఈ సినిమా జూన్ 30న రిలీజ్ అవుతుంది. చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
దర్శకుడు జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ - ''ఫస్ట్ గంటా శ్రీనివాసరావుగారికి, శారదగారికి థాంక్స్. నన్ను నమ్మి వారి అబ్బాయిని నా చేతిలో పెట్టినందుకు. నా ఫ్రెండ్ అశోక్ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా తీశారు. సినిమా సూపర్‌గా వచ్చింది. గంటా రవికి, మాళవికకు అందరి ఆశీర్వాదాలు కావాలి'' అన్నారు.
నిర్మాతల మండలి కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''పోలీస్ వ్యవస్థ మీద గంటా శ్రీనివాసరావుగారికి ఎంతో మక్కువ. అందుకే వారి అబ్బాయితో 'జయదేవ్'వంటి పవర్ఫుల్ సినిమా తీశారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
అనంతరం పోలీస్ శాఖ సంక్షేమ సహాయార్థం కోసం వైజాగ్ పోలీస్ కమీషనర్ యోగానంద్గారికి 5 లక్షల రూపాయల చెక్‌ను చిత్ర నిర్మాత కె.అశోక్‌కుమార్ అందజేశారు. అలాగే స్పెషల్ స్టూడెంట్స్ ఇన్సూరెన్స్ పాలసీని వేదికపై లాంచ్ చేశారు. విశేషంగా తరలివచ్చిన అభిమానులు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, హీరో గంటా రవిలను గజమాలలతో సత్కరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments