15 రోజుల తర్వాత కుటుంబాన్ని కలిసిన బన్నీ.. వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నాడు. 15 రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన బన్నీకి కొడుకు, కూతురు నుంచి ఘన స్వాగతం లభించింది. బన్నీని చూడగానే కొడుకు అల్లు అయాన్, అర్హ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. వెళ్లి తమ తండ్రిని హగ్ చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బన్నీ ట్విటర్లో షేర్ చేశారు. ‘‘పరీక్షల్లో నెగిటివ్ అని నిర్ధారణ అయింది. 15 రోజుల క్వారంటైన్ తరువాత కుటుంబాన్ని కలుస్తున్నాను. పిల్లల్ని చాలా మిస్ అయ్యాను’’ అని అల్లు అర్జున్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. బన్నీ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా.. గత నెల 28న అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని బన్నీ అదే రోజున స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘‘హాయ్ ఎవ్రీ వన్. నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను అలాగే ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తున్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా వెళ్లి టెస్ట్ చేయించుకోండి. ఇంట్లోనే ఉండండి, సేఫ్‌గా ఉండండి. అవకాశం వచ్చిన వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. నా వెల్ విషర్స్, అభిమానులు ఆందోళన చెందవద్దు. నేను బాగానే ఉన్నాను’’ అని బన్నీ నాటి ట్వీట్లో పేర్కొన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com