చరణ్ కు బన్ని వాయిస్ ఓవర్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రాంచరణ్ హీరోగా అల్లు అరవింద్ కన్నడంలో సూపర్ హిట్ అయిన బహుద్దూర సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడట. అవుటండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో ధృవ సర్జా హీరోగా నటించాడు. ఇప్పుడు చరణ్ హీరోగా రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నాడట అల్లు అరవింద్.
ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాకు కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్ వాయిస్ ఓవర్ చెప్పాడు. ఇప్పుడు తెలుగులో ఆ వాయిస్ ఓవర్‌ను బన్నితో చెప్పించాలనేది అల్లు అరవింద్ ప్లాన్ అని అంటున్నారు. సాధారణంగా ఇప్పుడు స్టార్ హీరోస్ ఇతర హీరోల చిత్రాలకు వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. జల్సాలో మహేష్, ఎన్టీఆర్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మరిప్పుడు బన్ని కూడా తొలిసారి చరణ్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. చరణ్, బన్ని కలిసి ఎవడు సినిమాలో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com