ఈసారి బన్నీ విలన్ వంతు

  • IndiaGlitz, [Tuesday,August 08 2017]

మెగా ఫ్యామిలీలోని ఎవ‌రైనా ఒక‌ హీరోతో హిట్ కొడితే.. మిగిలిన ఆ ఫ్యామిలీ టాప్ హీరోలు కూడా కొంత‌మంది హీరోయిన్ల‌కు ఛాన్స్‌లు ఇవ్వ‌డం అనేది ఈ మ‌ధ్య కాలంలో కామన్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నా, స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రుతి హాస‌న్‌.. ఇలా చెప్పుకోద‌గ్గ లిస్టే ఉంది ఈ విష‌యంలో. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌.. వీరిలో ఏ ఒక్క‌రితోనో హిట్ కొట్ట‌డం.. ఆ త‌రువాత మిగిలిన ఇద్ద‌రి సినిమాల్లోనూ అవ‌కాశాలు పొంద‌డం .. పై హీరోయిన్‌ల విష‌యంలో జ‌రిగింది.

అయితే కొత్త‌గా ఇది ఓ విల‌న్‌కి వ‌ర్తించ‌డం విశేషంగా మారింది. ఇంత‌కీ ఆ విల‌న్ ఎవ‌రంటే.. ఆది పినిశెట్టి. హీరో నుంచి విల‌న్‌గా ట‌ర్న్ అయిన ఆది.. బ‌న్నీ హీరోగా న‌టించిన స‌రైనోడు తో ప్ర‌తినాయ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో మిగిలిన మెగా హీరోల దృష్టిలో ప‌డ్డ ఆది.. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రంలోనూ.. చ‌ర‌ణ్‌, సుకుమార్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న రంగ‌స్థ‌లంలోనూ న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. మ‌రి ఏ శ్రుతిహాస‌న్ లాగో.. ఆది కూడా ఈ ముగ్గురికి క‌లిసి వ‌స్తాడో లేదో చూడాలి.

More News

జగపతిబాబు..రిపీట్ అవుతుందా?

లెజెండ్ తో విలన్ గా టర్న్ అయిన ఒకప్పటి కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు జగపతిబాబు..

ఈ సారి అయినా చైతూకి ఫలితం మారుతుందా

గతేడాది ప్రేమమ్ తోనూ..ఈ ఏడాది రారండోయ్ వేడుక చూద్దాంతోనూ తన ఖాతాలో చాన్నాళ్ల తరువాత విజయాలను జమ చేసుకున్నాడు నాగచైతన్య.

రీ - రికార్డింగ్ లో సూపర్ స్టార్ మహేష్ 'ఎ.ఆర్.మురుగదాస్ ల 'స్పైడర్'

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్ మధు సమర్పణలో

ఆ ముగ్గురు మళ్లీ కలిసారు..హిట్ కొడతారామరి?

ఇష్క్,గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలతో తిరిగి విజయాల బాట పట్టిన నితిన్ కి..

ప్రభాస్ , బన్ని ఒకే బాటలో..

అగ్ర కథానాయకులు రెబల్ స్టార్ ప్రభాస్,స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తమ కొత్త చిత్రాల విషయంలో ఒకే బాటలో వెళ్తున్నారు.