సైరాలో బ‌న్ని విల‌న్‌...

  • IndiaGlitz, [Monday,May 07 2018]

అల్లు అర్జున్ 'రేసుగుర్రం'తో విల‌న్‌గా ప‌రిచ‌య‌మైన బోజ్‌పురి న‌టుడు ర‌వికిష‌న్‌. త‌ర్వాత ఈ యాక్ట‌ర్ ప‌లు తెలుగు చిత్రాల్లో త‌న‌దైన విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ న‌టుడు చిరంజీవి 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ట‌.

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ఇందులో ర‌వికిష‌న్ నెగ‌టివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అందుకు సంబంధించిన స‌న్నివేశాల‌ను యూనిట్ చిత్రీక‌రిస్తుంది. చిరంజీవితో పాటు న‌య‌న‌తార‌, అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, త‌మ‌న్నా త‌దిత‌రులు న‌టిస్తున్నారు.  

More News

మ‌ల‌యాళంలో నాగ్‌...

కింగ్ నాగార్జున ఇప్పుడు మ‌ల‌యాళ సినిమాలో న‌టించ‌బోతున్నారు. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌తో నాగార్జున‌కు మంచి అనుబంధం ఉన్న సంగ‌తి తెలిసిందే.

మ‌ణిర‌త్నం మ‌ల్టీస్టార‌ర్ మూవీ అప్‌డేట్‌

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 'నవాబ్' (తమిళంలో 'చెక్క చివంత వానం') పేరుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

రెండు వారాల గ్యాప్‌లో రాజ్ త‌రుణ్‌

'ఉయ్యాలా జంపాలా', 'కుమారి 21ఎఫ్', 'సినిమా చూపిస్త మావ' లాంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్.

నేటి ట్రెండ్ కి తగ్గ పర్ ఫెక్ట్ సినిమా తారామణి - డైరెక్టర్ మారుతి

తమిళంలో తారామణి పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

భారత సైన్యంలో చేరేందుకు సిద్ధమయ్యాను - ఆర్మీ అధికారుల స్పెషల్ షోలో అల్లు అర్జున్

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నట విశ్వరూపం చూపించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.