బ‌న్ని రెండు కొత్త చిత్రాల అప్‌డేట్స్‌

  • IndiaGlitz, [Thursday,July 05 2018]

ఇటీవ‌ల విడుద‌లైన‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో న‌టుడిగా మ‌రింత గుర్తింపు తెచ్చుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కాగా.. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమాకి సైన్ చేస్తున్న ఈ రోజుల్లో.. తన గత చిత్రం విడుదలై రెండు నెలలు కావస్తున్నా బన్నీ.. తన కొత్త సినిమా గురించి ఎటువంటి ప్రకటన చేయపోవడం కొంత ఆశ్చర్యం కలిగించేదే. అయితే ఈ క్రమంలో బన్నీ తదుపరి చిత్రాల గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

అవి ఏమిటంటే.. ‘ఇష్క్’, ‘మనం’, ‘24’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో బన్నీ ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని గతంలో బన్నీతో ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన నల్లమలుపు బుజ్జితో కలిసి నాగం అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారట.

ఇదిలా ఉంటే.. ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ లాంటి సినిమాల‌ను రూపొందించిన ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో ముచ్చటగా మూడోసారి బన్నీ జట్టు కడుతున్నట్టు కూడా తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి.. గతంలో బన్నీతో ‘దేశముదురు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన డి.వి.వి.దానయ్య నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ల‌కు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది.