నితిన్ భీష్మ సక్సెస్... పెళ్లిపై బన్నీ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ అనే సామెత వినే ఉంటాం .. అలా ఇప్పుడు నితిన్ పరిస్థితి తయారైంది. ఈ శుక్రవారం విడుదలైన భీష్మ చాలా పెద్ద హిట్‌గా నితిన్ కెరీర్‌లో కలెక్షన్స్ రాబడుతుంటే.. మరో పక్క తన స్నేహితురాలు షాలినిని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడు నితిన్. ఈ రెండు ఆనందాలను ఎంజాయ్ చేస్తున్న నితిన్ గురించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఒక పక్క భీష్మ గురించి నితిన్ సహా ఎంటైర్ యూనిట్‌ను అభినందిస్తూనే నితిన్ పెళ్లి గురించి బన్నీ ట్వీట్ చేయడం విశేషం.
``డైరెక్టర్ వెంకీ కుడుములకు అభినందనలు. తను ఎమోషనల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించాడు. అలాగే రష్మిక ఆల్ రౌండర్ పాత్రను పోషించింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలలో విజయాలను అందుకున్న నిర్మాత వంశీగారికి అభినందనలు. ఇక నితిన్‌కు డబుల్ కంగ్రాట్స్. డబుల్ జోష్‌తో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. మంచి సమయాల్లో మంచి పనులు జరుగుతాయి. హ్యాపీగా ఉంది. ఎంటైర్ యూనిట్‌కు కంగ్రాట్స్`` అంటూ బన్నీ మెసేజ్‌ను ట్వీట్ చేశారు.
నితిన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా భీష్మ సినిమా రూపొంంది. ఈ నెల 21న సినిమా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్‌సీస్‌లోనూ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది.
Double Congratulations @actor_nithiin . Now the wedding celebrations will happen with double josh. Best thing happened at the best time . Really happy for you . I Congratulate the entire Cast & Crew of #Bheeshma .
— Allu Arjun (@alluarjun) February 24, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com