మూడో స్థానం కోసం బ‌న్నీ ప‌రుగు...చేరుకుంటాడా?

  • IndiaGlitz, [Tuesday,January 21 2020]

వ‌రుస సినిమాలు చేస్తూ ఓ కూల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయాల‌నుకున్న బ‌న్నీ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. ఆ త‌ర్వాత త‌న‌తో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసిన త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చేసిన మూడో చిత్రం 'అల‌..వైకుంఠ‌పుర‌ములో'. హ్యాట్రిక్ కాంబో కావ‌డం.. త‌మ‌న్ సంగీతంలో విడుద‌లైన పాట‌లు సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే క్రియేట్ అయ్యాయి. అయితే అంచ‌నాల‌కు ధీటుగా ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతుంది.

సినిమా విడులైన ప‌ది రోజుల లోపే వంద‌కోట్ల రూపాయ‌ల షేర్ క‌లెక్ష‌న్స్‌ను సాధించిన ఈ చిత్రం ఓవ‌ర్‌సీస్‌లోనూ స‌త్తా చాటుతుంది. లేటెస్ట్‌గా ఈ సినిమా మూడు మిలియ‌న్ డాల‌ర్ మార్క్‌ను క్రాస్ అయ్యింది. బాహుబ‌లి 2, బాహుబ‌లి ది బిగినింగ్ చిత్రాల త‌ర్వాత రంగ‌స్థ‌లం 3.51 మిలియ‌న్ డాల‌ర్స్‌, భ‌ర‌త్ అనే నేను 3.41 మిలియ‌న్ డాల‌ర్స్‌తో లైన్‌లో టాప్‌గా ఉన్నాయి. ఇప్పుడు బ‌న్నీ స్పీడు చూస్తుంటే త‌న 'అల వైకుంఠ‌పుర‌ములో' చిత్రంతో వీటి వ‌సూళ్ల‌ను అధిగ‌మిస్తాడ‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఫుల్ ర‌న్‌లో బ‌న్నీ ఓవ‌ర్‌సీస్ క‌లెక్ష‌న్స్‌లో మూడో స్థానాన్ని ఆక్ర‌మిస్తాడో లేదో చూడాలి.

More News

ప‌క్కా మాస్ టైటిల్‌తో వెంక‌టేశ్ `అసుర‌న్‌`

త‌మిళంలో ధ‌నుష్ హీరోగా న‌టించిన చిత్రం `అసుర‌న్‌`. వెట్రిమార‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

`RRR` టీమ్‌తో జ‌త క‌ట్టిన బాలీవుడ్ స్టార్‌

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం

ఇక రెండు నెల‌లు మ‌హేశ్ క‌న‌ప‌డ‌డు...!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఈ సంక్రాంతికి `స‌రిలేరునీకెవ్వ‌రు`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. పెద్ద స‌క్సెస్‌ను సొంతం చేసుక‌న్న సంగ‌తి తెలిసిందే.

`పింక్` మొద‌లెట్టిన ప‌వ‌న్‌.. వైర‌ల్ అవుతున్న ప‌వ‌న్ ఫొటో

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

అల్ల‌రి న‌రేశ్ కొత్త ప్ర‌య‌త్నం.. రీ ఎంట్రీ అనుకోవాలా?

నేటి త‌రం హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు అల్ల‌రి న‌రేశ్‌. త‌న‌దైన కామెడీ టైమింగ్ ఉన్న సినిమాల‌తో చాలా త్వ‌ర‌గా 50 సినిమాల‌ను చాలా త్వ‌ర‌గా పూర్తి చేసుకున్న అల్లరి న‌రేశ్‌కి