మూడో స్థానం కోసం బన్నీ పరుగు...చేరుకుంటాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస సినిమాలు చేస్తూ ఓ కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకున్న బన్నీ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత తనతో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి విజయవంతమైన చిత్రాలు చేసిన త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేసిన మూడో చిత్రం `అల..వైకుంఠపురములో`. హ్యాట్రిక్ కాంబో కావడం.. తమన్ సంగీతంలో విడుదలైన పాటలు సూపర్‌డూపర్ హిట్ కావడంతో సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. అయితే అంచనాలకు ధీటుగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ను రాబడుతుంది.
సినిమా విడులైన పది రోజుల లోపే వందకోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్‌ను సాధించిన ఈ చిత్రం ఓవర్సీస్లోనూ సత్తా చాటుతుంది. లేటెస్ట్గా ఈ సినిమా మూడు మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ అయ్యింది. బాహుబలి 2, బాహుబలి ది బిగినింగ్ చిత్రాల తర్వాత రంగస్థలం 3.51 మిలియన్ డాలర్స్, భరత్ అనే నేను 3.41 మిలియన్ డాలర్స్‌తో లైన్లో టాప్‌గా ఉన్నాయి. ఇప్పుడు బన్నీ స్పీడు చూస్తుంటే తన `అల వైకుంఠపురములో` చిత్రంతో వీటి వసూళ్లను అధిగమిస్తాడనే వార్తలు వినపడుతున్నాయి. మరి ఫుల్ రన్లో బన్నీ ఓవర్సీస్ కలెక్షన్స్‌లో మూడో స్థానాన్ని ఆక్రమిస్తాడో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com