జ‌న‌వ‌రికి వెళ్లిన బ‌న్ని,త్రివిక్ర‌మ్ చిత్రం..

  • IndiaGlitz, [Saturday,November 24 2018]

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం త‌ర్వాత బ‌న్ని మ‌రో సినిమాను చేయ‌లేదు. కాస్త గ్యాప్ తీసుకున్నాడు. మ‌ధ్యలో చాలా క‌థ‌ల‌నే విన్నాడు. విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేయాల‌నుకున్నాడు కూడా. అయితే చివ‌ర‌కు బ‌న్ని యూ ట‌ర్న్ తీసుకుని త్రివిక్ర‌మ్ సినిమా చేయాల‌నుకున్నాడు. దాదాపు స్క్రిప్ట్ అంతా ఓకే అయ్యింది.

'సోను కె టిటు కి స్వీటీ' అనే ఓ హిందీ సినిమా నుండి త్రివిక్ర‌మ్ తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్లు మార్చుతున్నాడ‌ట‌. ఈ స్కిప్ట్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి కావ‌డానికి డిసెంబ‌ర్ కావ‌చ్చు. కాబ‌ట్టి ఈ నెల‌లో స్టార్ట్ చేయాల్సిన సినిమా జ‌న‌వ‌రిలో ప్రారంభిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రో ప‌క్క సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.