త్రివిక్రమ్, బన్నీల మధ్య చర్చోపచర్చలు.. ఏం తేలుస్తారో?

అల్లువారబ్బాయి అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పటికే యూ ట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 12న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రన్ టైమ్ .. హీరో, డైరెక్టర్‌ల మధ్య తీవ్ర చర్చకు దారి తీసిందట. ఎడిటింగ్ అనంతరం.. ఫైనల్ రష్ చూసి.. రన్ టైమ్ 3.05 గంటలని త్రివిక్రమ్ చెప్పారట. అయితే ఇంత ఎక్కువ నిడివి వద్దని బన్నీ పట్టుబడుతున్నాడట. తను రాసుకున్న పంచ్ డైలాగులతో , కామెడీ ట్రాక్‌తో సినిమా బాగా వచ్చిందని.. ఏదీ తీసేయడానికి కుదరడం లేదని త్రివిక్రమ్ చెబుతున్నారట. అయితే అల్లు అర్జున్‌కు తుది నిర్ణయాన్ని అప్పగించారని సమాచారం. మరి బన్నీ ఏం చేస్తాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జ‌యరాం, టటు, సుశాంత్‌, నివేదా పేతురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 28న హైద‌రాబాద్‌లో, జ‌న‌వ‌రి 5న వైజాగ్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నార‌ట‌.

More News

రాజమండ్రిలో 'ప్రతిరోజు పండగే' విజయోత్సవం

సాయి తేజ్ మరో డిఫరెంట్ హిట్ అందుకున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన "ప్రతి రోజు పండగే" సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది.

'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' ప్రీ రిలీజ్

'జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా' వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా,

వైజాగ్ కుర్రాళ్లకు ఆర్జీవీ అదిరిపోయే ఆఫర్..!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘నా రూటే సెపరేటు..

చియాన్ 58 టైటిల్‌.. ఈసారైనా స‌క్సెస్ ద‌క్కుతుందా?

చియాన్ విక్ర‌మ్ 58వ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అంజ‌లి సీబీఐ ఆఫీస‌ర్(ఇమైకా నొడిగ‌ల్‌) ఫేమ్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

వాట్సాప్ యూజర్లు జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీనే!

డిజిటల్‌ పేమెంట్స్ వచ్చిన తర్వాత మోసాలు ఎక్కువయ్యాయ్!. ఇలా పేమెంట్స్ చేయడం వల్ల మోసాలు జరిగాయని వస్తున్న వార్తలను మనం తరుచుగా వింటుంటాం.