బ్రేక్ తీసుకున్న బన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా ‘పుష్ప’ సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మారేడుమిల్లి, రంపచోడవం గ్రామాల్లో చిత్రీకరణ జరుపుకున్న పుష్ప.. కొత్త షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేసుకుంది. ఫిబ్రవరి 13 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ వారం గ్యాప్‌ను బన్నీ తన ఫ్యామిలీతో చిన్న టూర్ ప్లాన్ చేసేశాడు. అయితే బన్నీ ఎక్కడికి వెళ్లాడనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. మారేడు మిల్లిలోనే కంటిన్యూ షెడ్యూల్ పూర్తి చేసిన బన్ని.. ఫ్యామిలీని బాగా మిస్ అయ్యాడని, అందుకే రాగానే కుటుంబంతో టూర్ వెళ్లాడని అంటున్నారు.
ఇక ‘పుష్ప’ విషయానికి వస్తే, శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనున్నాడు. ఫిబ్రవరి 13 నుంచి తెన్ కాశి, పొల్లాచ్చిల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో రష్మిక మందన్న కూడా జాయిన్ అవుతుంది. రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించడానికి సుకుమార్ ప్లాన్ చేశాడని టాక్. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ని ఆగస్ట్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments