పవన్ డైరెక్టర్ తో బన్ని..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు చిత్రంతో బ్లాక్ బష్టర్ సాధించిన విషయం తెలిసిందే. సరైనోడు తర్వాత తమిళ డైరెక్టర్ లింగుస్వామి, విక్రమ్ కుమార్ లతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల బ్రహ్మోత్సవం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో బన్ని ఓ చిత్రం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే...తాజా సమాచారం ప్రకారం... పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే బ్లాక్ బష్టర్ తీసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నిఓ చిత్రం చేయనున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. కథ రెడీ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా గురించి ఎనౌన్స్ చేయనున్నారట. హీరోని ఎలా చూపిస్తే అభిమానులు, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో హరీష్ శంకర్ కి బాగా తెలుసు. సో...బన్నితో హరీష్ శంకర్ సినిమా తీస్తే...ఫ్యాన్స్ కి పండగే..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com