బన్ని నిర్మాతగా మారుతున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నిర్మాతగా మారుతున్నాడా? అవుననే అంటున్నారు కొందరు సినీ వర్గాలకు చెందిన వ్యక్తులు. వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా చేస్తున్న బన్ని తదుపరిగా క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తాడట. ఈ సినిమాకు క్రిష్ `అహం బ్రహ్మాస్మి` అనే టైటిల్‌ను నిర్ణయించుకున్నారు.
నిన్న మొన్నటి వరకు వీరి కలయికలో సినిమా ఉంటుందనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే నేడు ఈ సినిమాను బన్నియే ప్రొడ్యూస్ చేస్తాడని అంటున్నారు. అంటే ఆల్ రెడీ బన్ని తండ్రి అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ అనే సంగతి తెలిసిందే. తన తండ్రితో కాకుండా బన్ని ఇప్పుడు స్వంతంగా సినిమా నిర్మిస్తాడా? లేక క్రిష్‌తో కలిసి సహ నిర్మాతగా సినిమా చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com