18 ఏళ్లుగా నాతో కలిసున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: బన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’ విడుదలై నేటికి 18 ఏళ్లు. ఈ విషయాన్ని గుర్తు చేస్తే బన్నీ ఓ ట్వీట్ చేశాడు. ‘గంగోత్రి’ బన్నీ తొలి చిత్రమే కాకుండా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వందో మూవీ కూడా కావడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను సాధించింది. ఆర్తీ అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ కూడా ఈ చిత్రం ద్వారానే వెండితెరకు పరిచయమైంది. అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయింది. కానీ మాత్రం స్టార్ హీరోగా నిలిచిపోయాడు. ఇప్పుడు బన్నీ సినిమా ఏదైనా వస్తోందంటేనే అభిమానుల ఆనందానికి అవధులుండవు. అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు.
‘గంగోత్రి’ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. సినిమాలో పాటలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. కీరవాణీ అందించిన సంగీతం ఇప్పటికీ అలరిస్తోంది. గంగోత్రి చిత్రం మార్చి 28,2003న విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 18 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. నా తొలి చిత్రం విడుదలై నేటితో 18 ఏళ్లు అయింది. నా 18 ఏళ్ల జర్నీలో నాతో కలిసి పని చేసిన అందరికీ బన్నీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అల్లు అర్జున్‌కి తన చేతుల మీదుగా రాఘవేంద్రరావు వంద రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ విషయాన్ని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా దర్శకేంద్రుడు వెల్లడించారు.
‘‘నా తొలి చిత్రం విడుదలై నేటికి 18 ఏళ్లు అయింది. నా 18 ఏళ్ల ప్రయాణంలో నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. కృతజ్ఞతాభావంతో నా హృదయం నిండిపోయింది. ఇన్నేళ్లుగా మీ ప్రేమను అందుకుంటున్నందుకు నేను నిజంగా పెట్టి పుట్టాను. మీరు చూపిస్తున్న ధన్యవాదాలు’’ అని బన్నీ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఊరమాస్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి మంచి హైప్ క్రియేట్ అయింది. అంతేకాకుండా ఇలాంటి కేరెక్టర్ బన్నీ కెరీర్‌లోనే తొలిసారి కావడంతో అంచనాలకు రెక్కలొచ్చాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout