సి.ఎం కి ధ్యాంక్స్ చెప్పిన బన్ని

  • IndiaGlitz, [Saturday,October 10 2015]

తెలంగాణ వీర‌నారి రుద్ర‌మ‌దేవి చ‌రిత్ర ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌క నిర్మాత‌ గుణ‌శేఖ‌ర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన భారీ చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ సినిమాలో అనుష్క టైటిల్ రోల్ పోషించింది. రానా, అల్లుఅర్జున్,క్రిష్ణంరాజు, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. దాదాపు డెబ్బై కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాని గుణ‌శేఖ‌ర్ రూపొందించాడు. ఈ సినిమా తీసినందుకు తెలంగాణ సి.ఎం కేసీఆర్ ఎంట‌ర్‌టైన్మెంట్ ట్యాక్స్ తొల‌గించారు. తెలంగాణ వీరనారి రుద్ర‌మ‌దేవి పై సినిమా తీసిన గుణ‌శేఖ‌ర్‌ను సి.ఎం. కెసిఆర్..ప్ర‌త్యేకంగా అభినందించారు. అయితే రుద్ర‌మ‌దేవిలో గోన గ‌న్నారెడ్డి పాత్ర పోషించిన బ‌న్ని ఈ సినిమాకి ఎంట‌ర్ టైన్మెంట్ ట్యాక్స్ తొలగించినందుకు ట్విట్ట‌ర్ ద్వారా కె.సి.ఆర్ గారికి ధ్యాంక్స్ తెలియ‌చేసాడు.

More News

తెలుగు చిత్రసీమలో కొత్త అధ్యాయం 'రుద్రమదేవి' : సుమన్

"తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గౌరవనీయులైన కేసీఆర్ గారు 'రుద్రమదేవి' చిత్రానికి వినోదపు పన్ను మినహాయించడం స్వాగతించవలసిన అంశం.

చిరుకు ముహుర్తం కుదిరిందా..?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

తన పెన్ పవర్తో గోనగన్నారెడ్డిని పాత్రను మలచిన రాజసింహ

ఇండియన్ తొలి హిస్టారికల్ ఇండియన్ 3డి మూవీగా రూపొందిన చిత్రం రుద్రమదేవి.

షకీలాగా షేక్ చేయనున్న సమంత

క్యూట్ గర్ల్ సమంత.. షకీలాగా సందడి చేయబోతోంది. 'నీ పేరేంట 'ని అడగడం ఆలస్యం.. 'షకీలా' అంటూ హై ఎనర్జీ లెవల్స్ తో చెప్పుకొచ్చే పాత్రలో సమంత వెండితెర పై కనిపించనుంది.

తనయులు ప్లస్ స్టార్ హీరోలు

దసరా పండక్కి రెండు భారీ చిత్రాలు వారం రోజుల గ్యాప్ లో రానుండడమే తెలుగు ప్రేక్షకులకి మహదానందమైతే.. ఇద్దరు అగ్ర నాయకులు చెరో సినిమాలో తళుక్కున మెరవడం మరింత ఎంటర్ టైన్ మెంట్ పెంచినట్లవుతోంది.