కొత్త ఆలోచ‌న‌లో బ‌న్నీ అండ్ టీమ్

  • IndiaGlitz, [Monday,June 01 2020]

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. పాన్ ఇండియా మూవీగా సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్న స‌మ‌యంలో క‌రోనా ప్ర‌భావంతో లాక్‌డౌన్ విధించారు. దీంతో షూటింగ్ ఆగింది. అయితే ఇప్పుడు షూటింగ్స్ ప్రారంభ‌మ‌య్యేలా క‌న‌ప‌డుతున్నాయి. అయితే స‌మాచారం మేర‌కు జూన్‌లో షూటింగ్స్ ప్రారంభమవుతాయి. అయిన రెండు నెల‌ల త‌ర్వాత అంటే ఆగ‌స్ట్‌లో పుష్ప టీమ్ సెట్స్‌పైకి వెళ్లాల‌నుకుంటుంద‌ట‌. కేర‌ళ‌లో అనుకున్న షెడ్యూల్‌ను ఇక్క‌డే యూనిట్ ప్లాన్ చేసింది. అంతే కాకుండా నెల‌రోజుల పాటు సాగే తొలి షెడ్యూల్‌ను 80 మంది క్రూతో ప్లాన్ చేస్తున్నార‌ట‌. యూనిట్ అంతా ఓ ప్రాంతంలోనే ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ట‌. బ‌య‌ట‌వారు ఆ ప్రాంతానికి వెళ్ల‌రు. అలాగే యూనిట్ స‌భ్యులు కూడా బ‌య‌ట వారిని క‌ల‌వ‌రు. ఇది ఎంత మేర వ‌ర్కవుట్ అవుతుంద‌నే దాని బ‌ట్టే త‌దుప‌రి షెడ్యూల్స్ ప్లాన్ చేయాల‌నుకుంటున్నార‌ట బ‌న్నీ అండ్ టీమ్‌.

చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంలో రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో బన్నీ డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, ర‌గ్డ్ లుక్‌తో కనపడ్డారు. ఫ‌స్ట్ లుక్ చూసిన వారంద‌రూ బన్నీ లుక్‌ కొత్తగా ఉందని అన్నారు. రష్మిక మందన్నా హీరోయిన్. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్ర‌మిది.