మృతి చెందిన పవన్ అభిమానులకు బాసటగా అల్లు అర్జున్..
Send us your feedback to audioarticles@vaarta.com
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కడుతూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతోంది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడకకు సన్నాహాలు చేస్తూ సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం అనే ముగ్గురు జనసైనికులు మృతి చెందారు. వీరి మృతి విషయమై తాజాగా అల్లు అర్జున్ స్పందించారు.
పవన్ కల్యాణ్ అభిమానుల మృతి పట్ల బన్నీ ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున అందించనున్నట్టు బన్నీ వెల్లడించాడు. ‘‘దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో పవన్ కల్యాణ్ గారి అభిమానులు మృతి చెందారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున అందజేసి వారి కుటుంబాలకు అండగా నిలవాలనుకుంటున్నా. అభిమానులందరికీ, ప్రజలకు వారు కొనసాగిస్తున్న ప్రేమకు, మద్దతుకు అభినందనలు తెలియజేస్తున్నా’’ అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.
చిత్తూరులో పవన్ అభిమానులు మృతి చెందిన ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసని.. కానీ వారి ప్రాణం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చిరంజీవి సూచించారు. ‘‘చిత్తూరులో పవన్ బర్త్‌డేకి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్‌తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..’’ అని చిరు ట్వీట్లో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com