బన్నీ అభిమానులకు ‘‘పుష్ప’’ టీం షాక్.. ట్రైలర్ వాయిదా, కారణమిదే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్యకాలంలో మేకర్స్ .. అభిమానుల సహనంతో ఆడుకుంటున్నారు. మొన్నామధ్య ‘‘రాధేశ్యామ్ ’’ మొదటి పాట రిలీజ్ విషయంలో రగడ నడిచింది. చెప్పిన సమయానికి దీనిని విడుదల చేయకపోవడంతో అభిమానుల కోపం నషాళానికి అంటింది. ట్విట్టర్లో గోల గోల చేశారు. కొందరైతే ఏకంగా హైదరాబాద్ పోలీసులకు టాగ్ చేస్తూ యువి క్రేయేషన్స్ టీంని అరెస్ట్ చెయ్యమని పోస్ట్ చేశారు. ఇక తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ విషయంలోనూ నిర్మాతలు ఇలాగే చేస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈసినిమా ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి సోమవారం పుష్పా ట్రైలర్ రిలీజ్ చేస్తామని మైత్రీ మూవీస్ అనౌన్స్ చేసింది. అయితే అనివార్య కారణాలతో ట్రైలర్ విడుదల చేయలేకపోతున్నామని.. ఫ్యాన్స్‌కు ట్విట్టర్ ద్వారా క్షమాపణ చెప్పింది.
త్వరలోనే ట్రైలర్ లాంచ్ త్వరలోనే వుంటుందని చెప్పింది. అయితే మేకర్స్ తీరుపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని.. టెక్నికల్ ఇష్యూ అని చెప్పొద్దంటూ కోరుతున్నారు. కాగా పుష్ప ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. ‘‘దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి ”, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా, అంటూ సాగే నాలుగు పాటలను రిలీజ్ చేశారు
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో పుష్ప విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఫైనల్ అయ్యారు. తమిళ్‌లో లైకా ప్రోడక్షన్స్, కన్నడలో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక హిందీ విషయానికి వస్తే ‘‘ఏఏ ఫిల్మ్స్ ’’పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది . కాగా.. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫజీల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com