వరుణ్‌తేజ్ బ్యూటీతో బన్నీ స్పెషల్ సాంగ్..?
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్ తేజ్‌తో ‘లోఫర్’ చిత్రంలో నటించిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గుర్తుందిగా! ఎలా మరచిపోతారు. బాలీవుడ్‌లో తన హాటు అందాలతో సెగలు రేపుతుందీ అమ్మడు. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే వరుస సినిమాలు చేస్తుంది. ఈ సొగసరి త్వరలోనే మరోసారి టాలీవుడ్‌లో కనపడనుంది. అవునా? ఏ సినిమా చేయనుంది.. అనే సందేహాలు వ్యక్తం కావచ్చు. వివరాల్లోకెళ్తే దిశాపటానీ సినిమా చేయడం లేదు కానీ.. ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించనుంది. అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుంది. అందులో దిశా పటానీని నర్తింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.
రీసెంట్‌గా బుట్టబొమ్మ సాంగ్‌ను చూసి అసలు ఎలా చేశావ్ బన్నీ? అంటూ స్టైలిష్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. ఇప్పుడు అదే స్టార్‌తో ఈ భామ చిందేయనుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments