వ‌రుణ్‌తేజ్‌ బ్యూటీతో బ‌న్నీ స్పెష‌ల్ సాంగ్..?

  • IndiaGlitz, [Friday,May 01 2020]

వ‌రుణ్ తేజ్‌తో ‘లోఫ‌ర్’ చిత్రంలో న‌టించిన బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ గుర్తుందిగా! ఎలా మ‌ర‌చిపోతారు. బాలీవుడ్‌లో త‌న హాటు అందాల‌తో సెగ‌లు రేపుతుందీ అమ్మ‌డు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లోనే వ‌రుస సినిమాలు చేస్తుంది. ఈ సొగ‌స‌రి త్వ‌ర‌లోనే మ‌రోసారి టాలీవుడ్‌లో క‌న‌ప‌డ‌నుంది. అవునా? ఏ సినిమా చేయ‌నుంది.. అనే సందేహాలు వ్య‌క్తం కావ‌చ్చు. వివరాల్లోకెళ్తే దిశాపటానీ సినిమా చేయడం లేదు కానీ.. ఓ స్పెషల్ సాంగ్‌లో న‌ర్తించ‌నుంది. అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ పుష్ప‌. ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుంది. అందులో దిశా ప‌టానీని న‌ర్తింప చేయ‌డానికి ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

రీసెంట్‌గా బుట్ట‌బొమ్మ సాంగ్‌ను చూసి అస‌లు ఎలా చేశావ్ బ‌న్నీ? అంటూ స్టైలిష్‌స్టార్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది. ఇప్పుడు అదే స్టార్‌తో ఈ భామ చిందేయ‌నుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతోన్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

నాన్న‌మ్మ ద‌గ్గ‌ర రెసిపీ నేర్చుకుంటోన్న చ‌ర‌ణ్‌

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు సినీ సెల‌బ్రిటీలు. టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే సెల‌బ్రిటీలంద‌రూ బీ ద రియ‌ల్ మేన్ ఛాలెంజ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

లాక్‌‌డౌన్‌లో లిక్కర్‌ అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ 3.0 లాక్‌డౌన్‌ రెండు వారాల పాటు అనగా మే-17 వరకు కొనసాగనుంది.

లింగంపల్లి నుంచి వలస కార్మికులతో ఝార్ఖండ్‌‌కు తొలిరైలు!

దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను వారి స్వగృహాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణలోని లింగంపల్లి స్టేషన్ నుంచి ఝార్ఖండ్‌లోని హతియా స్టేషన్‌కి 1,230 మంది

లాక్ డౌన్ 3.0 : మే-17 వరకూ పొడిగింపు

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ 3.0 లాక్‌డౌన్‌ రెండు

ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థుల ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. ఇంటికెళ్లలేక అక్కడే ఉండలేక ఇన్నిరోజులూ