బన్నీ కొత్త లుక్ కోసం స్పెషల్ డైట్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలోని తన పాత్ర కోసం సరికొత్త డైట్‌ను ఫాలో అయ్యాడట. అసలు ఇంతకు బన్నీ డైట్‌ను ఎందుకు ఫాలో అయ్యాడు? అనే విషయంలోకి వెళితే.. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం `అల...వైకుంఠపురములో..`. ఈ సినిమాలో లుక్ కోసం బన్నీ 14 కిలోలు బరువు తగ్గాలని డైరెక్టర్ సూచించాడట. దీంతో బన్నీ కీటో డైట్‌ను ఫాలో అయ్యాడట. కీటో డైట్ అంటే కార్బోహైడ్రేట్స్‌ను ఆహారంలో తక్కువగా ఉండేలా చూసుకోవడమేనట. అంతే కాకుండా ప్రతిరోజూ రెండు గంటల పాటు రెగ్యులర్‌గా జిమ్ చేశాడట. దీంతో బరువు తగ్గి మరింత యంగ్‌గా తయారైయ్యాడట బన్నీ.
పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తుంది. జయరాం, మురళీశర్మ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గీతాఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ కోటీశ్వరుడి బిడ్డ పేదవాడుగా, పేదవాడి కొడుకు కోటీశ్వరుడిగా పెరుగుతారు. తదనంతర పరిస్థితులు ఎలా మారుతాయనేదే ఈ సినిమా కథాంశమని కూడా వార్తలు వినపడుతున్నాయి.
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న బన్ని ఈ సినిమాను చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout