చెప్పను బ్రదర్..వివాదం పై బన్ని మాటల్లో నిజం ఉంది.
- IndiaGlitz, [Thursday,May 19 2016]
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సక్సెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ పవర్ స్టార్ గురించి మాట్లాడమని అడగడం...బన్ని పవన్ గురించి చెప్పను బ్రదర్..అనడం...వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఆతర్వాత బన్ని ఇచ్చిన ఇంటర్ వ్యూలో కూడా జర్నలిస్ట్ లు పవన్ గురించి మాట్లాడను అన్నారు కారణం ఏమిటి అని అడిగితే...అప్పుడు కూడా అదే సమాధానం చెప్పను బ్రదర్. దీంతో పవన్ ఫ్యాన్స్ చూసుకుంటాం బ్రదర్ అంటూ బన్నికి కౌంటర్ ఇచ్చారు. ఇలా... బన్ని ఫ్యాన్స్ - పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఈ చెప్పను బ్రదర్ వివాదం మరింత ముదిరింది. ఇక లాభం లేదు ఈ వివాదానికి ఫుల్ స్టాఫ్ పెట్టాలి అనుకున్నట్టున్నాడు బన్ని. నిహారిక నటించిన ఒక మనసు ఆడియో రిలీజ్ కార్యక్రమం వేదికగా బన్ని చెప్పను బ్రదర్ వివాదం పై వివరణ ఇచ్చాడు.
దానికి కారణం పవర్ స్టార్ కాదు..కొంత మంది పవన్ ఫ్యాన్స్...
ఈ వివాదం పై బన్ని మాట్లాడుతూ...ఫ్యాన్స్ పవర్ స్టార్...పవర్ స్టార్ అని అరిచినప్పుడు నేను మాట్లాడుకుండా వెళ్లిపోతున్నాను. దానికి కారణం..పవర్ స్టార్ కాదు.. కొంత మంది పవర్ స్టార్ అభిమానులు. మళ్లీ చెబుతున్నాను కొంత మంది పవర్ స్టార్ అభిమానులు. పబ్లిక్ ఫంక్షన్ లో కొంత మంది గ్రూప్ గా ఫామ్ అయి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు. దాని వలన ఫంక్షన్ కి ఇబ్బంది కలుగుతుంది. ఫంక్షన్ కి వచ్చేవాళ్లు పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలి అనుకుంటారు. అలాంటి సమయంలో మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తుంటే...వాళ్లు ఏం చెప్పాలనుకున్నారో అది మరచిపోయి ఏదో చెప్పేసి వెళ్లిపోతున్నారు. దయచేసి అవతల వ్యక్తి మట్లాడలేనంతగా డిస్ట్రిబ్ చేయవద్దు. ఒక పెద్ద డైరెక్టర్ ఎంతో కష్టపడి సినిమా తీసి...మాట్లాడుతుంటుంటే పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు. డైరెక్టర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను చెప్పే విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉండచ్చు. కానీ దయచేసి అర్ధం చేసుకోండి అన్నారు.
చిరంజీవి గారు తర్వాత నాకు సపోర్ట్ చేసింది కళ్యాణ్ గారే..
అలాగే.. బయట హీరోల ఫంక్షన్ కి వెళ్లినప్పుడు కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి మా వాళ్ల ఫంక్షన్ లో మీ వాళ్ల గోల ఏమిటి అని నాతో అన్నారు. దయచేసి ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దు. పవన్ కళ్యాణ్ గారు...చాలాసార్లు నేను ఈ స్ధాయిలో ఉండటానికి మా అన్నయ్యే కారణం అని చెప్పారు. అలాంటిది చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడనీయకుండా అరుస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు అలా చేయడం నాకు నచ్చలేదు. ఈరోజు మనకి ఒక ఫ్లాట్ ఫామ్ ఏర్పరచిన చిరంజీవి గార్ని కూడా మాట్లాడకుండా చేస్తున్నారు. మీరు ఎంత అరచినా నేను పవన్ గురించి మాట్లాడను. పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని సార్లు చెప్పలేదు. ఆయన మీద ఉన్న ఇష్టం ఎన్ని సినిమాల్లో చెప్పలేదు. చిరంజీవి గారు తర్వాత పబ్లిక్ ఫంక్షన్ లో నాకు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. దయచేసి విషయం అర్థం చేసుకోండి. నేను ఈమధ్య ఇంటర్ వ్యూలో కళ్యాణ్ గారు గురించి అడిగినప్పుడు చెప్పలేదు...కాంట్రవర్సీ ఎందుకు అని ఎవైడ్ చేసాను కానీ..ఎవైడ్ చేయడం వలన ఇంత కాంట్రవర్సీ వస్తుందని ఊహించలేదు.
అపార్ధం చేసుకున్నారని బాధగా ఉంది...
ఈ సమయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. టైమ్ బాగుండి మూడు హిట్ లు కొట్టాడు కదా..అందుకే పవర్ స్టార్ గురించి మాట్లాడడం లేదు అని అపార్ధం చేసుకుంటారు. నేను పవర్ స్టార్ గురించి మాట్లాడకుండా వెళ్లిపోయినప్పుడు మీరు హర్ట్ అయి ఉంటారు. కానీ..నేను మిమ్మల్ని హర్ట్ చేసిన దానికంటే వంద రెట్లు హర్ట్ చేసారు మమ్మల్ని. మీ అల్లరిని అదుపులో పెట్టుకోండి. ఈ విషయం గురించి మీతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. దయచేసి నాఫ్యాన్స్ పవన్ కళ్యాన్ గారి ఫ్యాన్స్ కి రిక్వెస్ట్ సోషల్ మీడియాలో కామెంట్స్ ఆపండి. నా వలన చిరంజీవి గార్కి మచ్చ రావడం నాకు ఇష్టం లేదు. కొంత మంది ఫ్యాన్స్ చిన్ని విషయాన్ని పెద్దది చేసేసారు. అభిమానులు అపార్ధం చేసుకున్నారని బాధగా ఉంది. అయిపోయింది ఏదే అయిపోయింది ఇక వదిలేద్దాం అంటూ బన్ని వివరణ ఇచ్చారు.
బన్ని మాటల్లో నిజం ఉంది..
నితిన్ సినిమా చిన్నదాన నీకోసం ఆడియో ఫంక్షన్ కి నాగార్జున ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఆడియో వేడుకలో నాగార్జున మాట్లాడుతుంటే...కొంత మంది అభిమానులు పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచారు. పవన్ కంటే సీనియర్ హీరో..పైగా వివాదాలకు దూరంగా ఉండే హీరో నాగార్జున మాట్లాడుతుంటే...పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవడం నాగార్జునకే కాదు...చూసే వాళ్లకు కూడా ఇబ్బంది కలిగింది. అలాగే..లోఫర్ ఆడియో ఫంక్షన్ లో ప్రభాస్ మాట్లాడుతుంటే...పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరిచారు. ఇక్కడ కూడా ప్రభాస్ ఇబ్బంది పడడం..ఇక లాభం లేదనుకుని..ఐ లవ్ పవర్ స్టార్ ఇప్పుడు మాట్లాడవచ్చా...అని ఆతర్వాత ప్రభాస్ మాట్లాడడం జరిగింది.
ఆతర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...ఒక హీరో మాట్లాడుతున్నప్పుడు పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరచి పవన్ అభిమానులు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఈ విషయం పై స్పందించి ఫ్యాన్స్ కి చెబితే బాగుంటుంది అన్నారు. పూరికి ఎంత ఇబ్బంది కలిగితే ఇలా చెప్పి ఉంటారో ఊహించుకోవచ్చు. అయితే... వాస్తవాలు చెబితే నచ్చవు కదా. పవన్ ఫ్యాన్స్ అలా చేయడం కరెక్ట్ కాదు అని పూరి నిజం చెప్పడం తప్పు అయ్యింది. లోఫర్ సినిమాని అడ్డుకుంటాం అంటూ పవన్ ఫ్యాన్స్ హడావిడి చేసారు. లోఫర్ ప్రమోషన్స్ కి విజయవాడ వెళ్లినప్పుడు పూరి మాట్లాడుతుంటే...పవన్ ఫ్యాన్స్ మళ్లీ పవర్ స్టార్...పవర్ స్టార్ అంటూ అరుపులు. అప్పుడు పూరి.. పవర్ స్టార్ మీకు అభిమాన హీరో కావచ్చు..నాకు దేవుడు అనడంతో పవన్ ఫ్యాన్స్ అరుపులు ఆపారు. అలాగే...చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరుస్తూ..ఆయన్ని చాలా సార్లు ఇబ్బంది పెట్టారు.ఇలా...చాలా సార్లు చాలా మందిని కొంత మంది పవన్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారు. అందుచేత...బన్నిమాటల్లో నిజం ఉంది. ఆ వాస్తవాన్ని గుర్తించి... ఇక నైనా పవన్ ఫ్యాన్స్ మారితే బాగుంటుంది..!