బన్ని కొడుకు మహేష్ ఫ్యాన్....
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా పిల్లల మనసులో ఏ రాగద్వేషాలుండవు. వారికి నచ్చింది చేస్తుంటారు, చెబుతుంటారు. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే మెగా ఫ్యామిలీ అయినా, అల్లు ఫ్యామిలీ హీరోలకు వారి అభిమాన హీరో ఎవరంటే చెబితే మెగాస్టార్ చిరంజీవి పేరునో, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పేరునో చెబతుంటారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ మాత్రం బన్నికి షాకిచ్చాడట. అల్లు అయాన్ అంటే బన్నికి ప్రాణం. వీలున్నప్పుడల్లా అయాన్‌కు సమయం కేటాయిస్తుంటాడు బన్ని.
రీసెంట్‌గా ఈ బుడతడిని ఈ పేరేంటని అడిగితే అయాన్ అని చెప్పాడు. మీ నాన్న పేరేంటని అడిగితే అర్జున్ అని చెప్పాడు. అయితే సైకిల్ తొక్కేటప్పడు నీ పేరేంటని అడిగితే మాత్రం మహేష్‌బాబు అని చెప్పి అందరికీ షాకిచ్చాడట. అందుకు ప్రత్యేక కారణమేమి లేదట. శ్రీమంతుడు చిత్రంలో మహేష్ సైకిల్ తొక్కే స్టయిల్ అయాన్‌కు బాగా నచ్చిందట. అందుకే సైకిల్ తొక్కే సమయంలో తన పేరుని మహేష్‌బాబు అని చెప్పుకున్నాడంటున్నారు. మరి పెరిగి పెద్దయితే అయాన్ అభిమాన హీరో ఎవరవుతారో చూడాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com