బన్ని కొడుకు మహేష్ ఫ్యాన్....

  • IndiaGlitz, [Wednesday,May 24 2017]

సాధార‌ణంగా పిల్ల‌ల మ‌న‌సులో ఏ రాగ‌ద్వేషాలుండ‌వు. వారికి న‌చ్చింది చేస్తుంటారు, చెబుతుంటారు. ఇప్పుడు అస‌లు విష‌యంలోకి వ‌స్తే మెగా ఫ్యామిలీ అయినా, అల్లు ఫ్యామిలీ హీరోల‌కు వారి అభిమాన హీరో ఎవ‌రంటే చెబితే మెగాస్టార్ చిరంజీవి పేరునో, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరునో చెబ‌తుంటారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ మాత్రం బ‌న్నికి షాకిచ్చాడ‌ట‌. అల్లు అయాన్ అంటే బ‌న్నికి ప్రాణం. వీలున్న‌ప్పుడ‌ల్లా అయాన్‌కు స‌మ‌యం కేటాయిస్తుంటాడు బ‌న్ని.

రీసెంట్‌గా ఈ బుడ‌త‌డిని ఈ పేరేంట‌ని అడిగితే అయాన్ అని చెప్పాడు. మీ నాన్న పేరేంటని అడిగితే అర్జున్ అని చెప్పాడు. అయితే సైకిల్ తొక్కేటప్ప‌డు నీ పేరేంట‌ని అడిగితే మాత్రం మ‌హేష్‌బాబు అని చెప్పి అంద‌రికీ షాకిచ్చాడ‌ట‌. అందుకు ప్ర‌త్యేక కార‌ణ‌మేమి లేద‌ట‌. శ్రీమంతుడు చిత్రంలో మహేష్ సైకిల్ తొక్కే స్ట‌యిల్ అయాన్‌కు బాగా న‌చ్చింద‌ట‌. అందుకే సైకిల్ తొక్కే స‌మ‌యంలో త‌న పేరుని మ‌హేష్‌బాబు అని చెప్పుకున్నాడంటున్నారు. మ‌రి పెరిగి పెద్ద‌యితే అయాన్ అభిమాన హీరో ఎవ‌ర‌వుతారో చూడాల్సిందే..

More News

రజనీకాంత్ సినిమాలో నటిస్తున్న దర్శకుడు...

దర్శకుడుగా సినీ అభిమానులకు పరిచయమైన సముద్ర ఖని తర్వాత ఎన్నో సినిమాల్లో నటుడిగా కూడా మెప్పించాడు. తన నటనతో జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

దువ్వాడ సాంగ్ సెన్సేషన్

ఆర్య నుండి సరైనోడు వరకు డిఫరెంట్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో స్టైలిష్ స్టార్గా తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్. రీసెంట్ బ్లాక్ బస్టర్ సరైనోడు చిత్రంతో తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్నబన్ని తెలుగులో చిత్ర సీమలోనే కాదు, మలయాళ సినీ పరిశ్రమలో కూడా తనదైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.

చివరి సాంగ్ రికార్డింగ్ లో 'విశ్వరూపం-2'

లోకనాయకుడు కమల్హాసన్ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వరూపం2'. ఎప్పుడు సినిమా రూపొందిన విడుదల్లో మాత్రం కొన్ని కారణాల కారణంగా జాప్యం జరుగతూ వచ్చింది. ఈలోపు కమల్హాసన్ ఉత్తమవిలన్, చీకటి రాజ్యం సినిమాలు విడుదలయ్యాయి.

తమిళ్ సినిమా చేయనున్న రాజశేఖర్

ఆహుతి, అంకుశం, మగాడు వంటి చిత్రాల్లో పవర్ క్యారెక్టర్స్తో మెప్పించిన యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజశేఖర్ ఇప్పుడు పిఎస్వి గరుడ వేగ 125.18 సినిమాలో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనపడుతున్నాడు.

చలపతిరావు, యాంకర్ రవిలపై కేసు నమోదు

చలపతిరావు నోటి దూలతో చేసిన వ్యాఖ్యలు ఆయన్ను అంత ఈజీగా వదలేలా కనపడటం లేదు. చలపతిరావు మహిళలపై చేసి అసభ్యకర వ్యాఖ్యలపై, ఆయన్ను బలపరిచిన యాంకర్ రవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బండ్లగూడకు చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనాకుమారి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.