అల్లు అయాన్ స్టన్నింగ్ వీడియో.. అచ్చం తండ్రిలాగే చింపి ఆరేశాడుగా..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి వేసిన విత్తనం నుంచి ఒక మహా వృక్షంలా మారింది మెగా ఫ్యామిలీ. ఆయన అడుగుజాడల్లో నాగబాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నిహారిక, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సాయిథరమ్ తేజ్, కల్యాణ్ దేవ్ వంటి వారు హీరోలుగా నిలబడ్డారు. ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకుల్లో సగ భాగం మెగా ఫ్యామిలీ నుంచే వున్నారు. తాజాగా ఆ కుటుంబం నుంచి తర్వాతి తరం కూడా స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వనుంది.
అల్లు అర్జున్ - స్నేహ దంపతుల పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్‌కు కూడా సోషల్ మీడియాలో బోలెడు క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపైకి అడుగుపెడుతున్న అల్లు అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అల్లు అయాన్ వర్కవుట్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. సాయి కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘గని…కనివినీ ఎరుగని’ అంటూ ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ పాటను రీక్రియేషన్ చేశాడు. వరుణ్ తరహాలో భారీ వర్కవుట్లు చేశాడు అయాన్. దీనికి సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీంతో ఇది కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అయాన్ ఫీట్లను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘ అచ్చం బన్నీ లాగే ఎనర్జీ..స్టైల్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్గా కనిపించనున్నాడు. అందులో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్రలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments