బన్నీ సిస్టర్ సెంటిమెంట్
- IndiaGlitz, [Monday,May 20 2019]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. తర్వలోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానుంది. తాజా సమాచారం ప్రకారం బన్నిని త్రివిక్రమ్ కొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేయాలనుకుంటున్నాడు.
అందుకనే తన డ్రెస్సింగ్ స్టైలే కాదు.. హెయిర్ స్టైల్ కూడా మార్చేశాడు. సినిమా ప్రధాన కథంతా చెల్లెల చుట్టూనే తిరుగుతుందట. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నవదీప్, సుశాంత్‌లు కూడా నటిస్తున్నారు. గీతాఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు , అల్లు అరవింద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.