బ‌న్నీసెకండ్ హీరోయిన్‌... అంతా రూమ‌రేన‌ట‌!!

  • IndiaGlitz, [Saturday,April 25 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగాీ చిత్రంలో నివేదా థామస్ కూడా నటిస్తుందని, బ‌న్నీ ల‌వ‌ర్ పాత్ర‌లో నివేదా క‌న‌ప‌డుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కానీ ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని తెలిసింది. సినిమాలో ఒకే ఒక హీరోయిన్ ఉంటుంద‌ని స‌మాచారం.

పాన్ ఇండియా చిత్రంగా చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంలో రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో బన్నీ డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, ర‌గ్డ్ లుక్‌తో కనపడ్డారు. ఫ‌స్ట్ లుక్ చూసిన వారంద‌రూ బన్నీ లుక్‌ కొత్తగా ఉందని అన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వ‌ర‌కు చాలా వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. క‌రోనా వైరస్ కారణంగా ప్రారంభం కావాల్సిన షూటింగ్ ఆగిపోయింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమా మా షూటింగ్ మొదలవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డ‌తున్నాయి.