200 మిలియ‌న్ వ్యూస్‌ తో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ స‌రైనోడు ఇండియా రికార్డ్

  • IndiaGlitz, [Tuesday,July 17 2018]

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ , డైన‌మిక్‌ డైరక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఎస్ ప్రోడ్యూస‌ర్ అల్లు అరవింద్ నిర్మాత గా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సంచ‌ల‌నాలు సృష్టించిన విష‌యం తెలిసిందే.. లేటెస్ట్ గా మ‌రో మైల్‌స్టోన్ ఈచిత్ర విజ‌యం లో భాగమ‌యింది.

యూట్యూబ్ లో హింది డ‌బ్బింగ్ తో విడుద‌ల‌య్యిన స‌రైనోడు చిత్రం క‌నివిని ఎరుగ‌ని రీతిలో ఇండియాలో ఏ చిత్రం కూడా సాధించ‌లేని రికార్డు ని 200 మిలియ‌న్ వ్యూస్ ని క్రాస‌య్యింది. అంతేకాదు తెలుగు సినిమా స‌త్తా మ‌రోసారి ఈ చిత్రం తో నిరూపించ‌డం విశేషం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ టెర్రిఫిక్‌ ఫెర్‌ఫార్మెన్స్ కి బోయ‌పాటి శ్రీను ఎక్సార్డ‌న‌రి టేకింగ్ తోడై తెలుగు చ‌ల‌న‌చిత్ర రికార్డులే కాకుండా ఇండియాలో ఇలాంటి అరుదైన రికార్డు సాధించ‌టం తెలుగు సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం..

అంతే కాకుండా 6 ల‌క్ష‌ల 66 వేల లైక్స్ తో హైయ్య‌స్ట్ వ్యూవ్స్ సాధించిన చిత్రం గా బ‌న్ని మ‌రోక్క‌సారి త‌న స‌త్తా చాటుకున్నాడు., గ‌తం లో బ‌న్ని న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాధం చిత్రం 176 మిలియ‌న్ వ్యూస్ సాధించి రికార్డు నెల‌కోల్పాడు. త‌న రికార్డు త‌నే స‌రైనోడు చిత్రంతొ బ్రేక్ చేసుకున్నాడు. ఇవేకాకుండా గ‌తంలో రేసుగుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు కూడా రికార్డు స్థాయి వ్యూస్ సాధించాయి. అందుకే బ‌న్నిని ఫ్యాన్స్ అంద‌రూ కింగ్ ఆఫ్ సోష‌ల్ మీడియా అని ముద్దుగా పిలుచుకుంటారు..