బన్నీతో సేమ్ టు సేమ్

  • IndiaGlitz, [Tuesday,March 29 2016]

కొంద‌రికి కొన్ని విష‌యాలు భ‌లే విచిత్రంగా రిపీట్ అవుతుంటాయి. అలాంటి కొంద‌రిలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ కూడా ఒక‌డ‌నే చెప్పాలి. ఎందుకంటే.. అల్లు అర్జున్‌తో 'రేసు గుర్రం' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్న 'స‌రైనోడు' కూడా.. ఫ‌స్ట్ టైమ్ కాంబినేష‌న్ మూవీలాగే కొన్ని విష‌యాల‌ను రిపీట్ చేస్తోంది మ‌రి.

'రేసు గుర్రం' 2014 ఏప్రిల్ నెల‌లో విడుద‌లైతే.. 'స‌రైనోడు' సినిమా కూడా ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఆ సినిమా పాట‌ల‌ను ల‌హరి సంస్థ విడుద‌ల చేస్తే.. ఇప్పుడు కూడా 'స‌రైనోడు' పాట‌ల‌ను ల‌హ‌రి సంస్థే రిలీజ్ చేస్తోంది. బ‌న్నీతో సేమ్ టు సేమ్ అంటున్న‌ట్లుగా వ‌స్తున్న త‌మ‌న్ కొత్త చిత్రం 'స‌రైనోడు'.. 'రేసు గుర్రం'లాగే అత‌ని కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందేమో చూడాలి. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ 'స‌రైనోడు'లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కేథ‌రిన్ ట్రెసా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.