close
Choose your channels

గ్రాండ్‌గా ఉపాసన బేబీషవర్ ఫంక్షన్.. సందడి చేసిన బన్నీ, సానియా మీర్జా, కనికా కపూర్

Monday, April 24, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ్రాండ్‌గా ఉపాసన బేబీషవర్ ఫంక్షన్.. సందడి చేసిన బన్నీ, సానియా మీర్జా, కనికా కపూర్

పెళ్లయిన దాదాపు 12 ఏళ్ల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు ఇటీవల శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఉపాసన తాను గర్భందాల్చినట్లు ప్రకటించి మెగా కుటుంబాన్ని, అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ప్రెగ్నెన్సీ సమయంలోనే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డ్ రావడంతో ఈ జంట మరింత జోష్‌లో వుంది.

గ్రాండ్‌గా ఉపాసన బేబీషవర్ ఫంక్షన్.. సందడి చేసిన బన్నీ, సానియా మీర్జా, కనికా కపూర్

ఈ నేపథ్యంలో ఉపాసనకు ఆమె పుట్టింటివాళ్లు దుబాయ్‌లో సీమంత వేడుక నిర్వహించారు. ఉపాసన సిస్టర్స్ అనుష్పాల, సింధూరిలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్‌ పండుగలా సాగింది. భార్య గర్భం దాల్చడంతో చరణ్ కూడా ఎక్కువ సమయం ఉపాసనకే కేటాయిస్తున్నాడు.

గ్రాండ్‌గా ఉపాసన బేబీషవర్ ఫంక్షన్.. సందడి చేసిన బన్నీ, సానియా మీర్జా, కనికా కపూర్

బేబీషవర్ ఫంక్షన్లతో ఉపాసన బిజీ:

ఇదిలావుండగా ఉపాసనకు ప్రస్తుతం బేబీ షవర్ పార్టీలు ఘనంగా జరుగుతున్నాయి. దుబాయ్ ఈవెంట్ పక్కనబెడితే.. మిత్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఉపాసనకు బేబీ షవర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈసారి ఉపాసన స్నేహితురాలు సునీతా రెడ్డి ఆమెకు శ్రీమంతం వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, మంచు లక్ష్మీ, సానియా మీర్జా, కనికా కపూర్, అల్లు అర్జున్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గ్రాండ్‌గా ఉపాసన బేబీషవర్ ఫంక్షన్.. సందడి చేసిన బన్నీ, సానియా మీర్జా, కనికా కపూర్

స్పెషల్ అట్రాక్షన్‌గా అల్లు అర్జున్:

అయితే ఇక్కడ అన్నింట్లోకి చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి రావడం గురించే. గత కొంతకాలంగా బావబావమరుదులు రామ్ చరణ్, బన్నీ మధ్య గ్యాప్ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు గానీ, చరణ్ బర్త్ డే తదితర కార్యక్రమాలకు బన్నీ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు.

గ్రాండ్‌గా ఉపాసన బేబీషవర్ ఫంక్షన్.. సందడి చేసిన బన్నీ, సానియా మీర్జా, కనికా కపూర్

ఇక అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ, ఆయన పుట్టినరోజు సమయాల్లోనూ చరణ్ నుంచి పబ్లిక్‌గా ఎలాంటి విషెస్ రాలేదు. ఈ క్రమంలో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు వున్నట్లుగా వార్తలు జోరందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉపాసన బేబీ షవర్ కార్యక్రమానికి అల్లు అర్జున్ రావడం చర్చనీయాంశమైంది. అంతేకాదు.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన ప్రూవ్ చేసినట్లయ్యింది.

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment