బన్ని మళ్లీ ఆ భామకే ఛాన్స్ ఇచ్చాడా..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో రీసెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత బన్ని హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందే చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే...ఈ చిత్రంలో బన్ని సరసన కేథరిన్ నటించనున్నట్టు తెలిసింది. గతంలో కేథరిన్ అల్లు అర్జున్ తో కలిసి ఇద్దరమ్మాయిలతో.., రుద్రమదేవి, సరైనోడు చిత్రాల్లో నటించింది. కేథరిన్ నటించిన ఇద్దరమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు చిత్రాలు బన్నికి మంచిపేరు తీసుకువచ్చాయి. అందుకే కేథరిన్ కి మరోసారి అవకాశం ఇచ్చాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబర్ లో ప్రారంభించి సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com