చరణ్‌ను చూసి గర్వపడుతున్నా.. మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్ : ఆర్ఆర్ఆర్‌పై అల్లు అర్జున్ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్‌చరణ్ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్రా, నైజాం, సీడెడ్ అన్న తేడా లేకుండా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. మంచి పాజిటివ్ టాక్‌తో ఆర్ఆర్ఆర్ దూసుకెళ్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా సినిమాను చూసి మెచ్చుకుంటున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘‘ఆర్ఆర్ఆర్’’ను వీక్షించారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలతో కలిసి ఏఎంబీ మాల్‌లో సినిమా చూశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు.
"ఆర్ఆర్ఆర్' చిత్ర యూనిట్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. సినిమా అద్భుతంగా ఉందని.. వెండితెరపై ఇటువంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన రాజమౌళి అంటే తనకెంతో గౌరవమని... ఆయన మన అందరికీ గర్వకారణమన్నారు. నా బ్రదర్ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తనను చూసి ఎంతో గర్వపడుతున్నాను. మా బావ తారక్ (ఎన్టీఆర్) అద్భుతంగా నటించాడు. ఎన్టీఆర్ ఒక పవర్ హౌస్" అని అల్లు అర్జున్ ప్రశంసించారు. అజయ్ దేవగణ్, ఆలియా చాలా బాగా చేశారు. కీరవాణి, సెంథిల్ కుమార్, డీవీవీ దానయ్య.. ఇంకా అందరికీ ప్రత్యేక శుభాభినందనలు. భారతీయ సినిమాను గర్వపడేలా చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఇది KilleRRR’’ అంటూ బన్నీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా, నందమూరి అభిమానులు బన్నీ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాను హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో వీక్షించారు. చిరంజీవి తల్లి అంజనా దేవి, కూతుర్లు సుష్మిత , శ్రీజ, మనువరాళ్ల తో కలిసి చిరంజీవి ఆర్ఆర్ఆర్‌ను చూశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ ఎలా ఉంది అంటే.. చెప్పడానికి మాటలు లేవని.. సింప్లి సూపర్బ్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాలో చరణ్, తారక్ ల మధ్య బాండింగ్ బాగుందన్నారు. ఇద్దరు డ్యాన్స్ లో ఒకరితో నొకరు పోటీపడి చేశారని చిరు ప్రశంసించారు. చలన చిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని.. స్టార్ హీరోలు కలిసి నటించాలని మెగాస్టార్ ఆకాంక్షించారు
Hearty Congratulations to the Entire team of #RRR . What a spectacular movie. My respect to our pride @ssrajamouli garu for the vision. Soo proud of my brother a mega power @AlwaysRamCharan for a killer & careers best performance. My Respect & love to my bava… power house
— Allu Arjun (@alluarjun) March 26, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com