హరితహారంలో తన కోరిక బయటపెట్టిన బన్ని
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఈరోజు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అరవింద్, అల్లు అర్జున్, బన్ని భార్య స్నేహ, బన్ని తనయుడు అయాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం తన ఇంటి దగ్గర అల్లు అరవింద్, అల్లు అర్జున్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ...మా అబ్బాయి అయాన్ తో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్కలు నాటిన ప్లేస్ దగ్గర ఇల్లు కట్టాలి అనుకుంటున్నాను. త్వరలో ఇంటి నిర్మాణంకు సంబంధించిన పనులు ప్రారంభిస్తాం అంటూ తన మనసులో మాట బయటపెట్టారు బన్ని.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout