మోహన్ లాల్ సాయం తీసుకుంటున్న బన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతికి సందడి చేయనున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన సినిమా ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఒక్క తెలుగులోనే గాక.. మలయాళంలోనూ బన్నీకి మార్కెట్ ఉంది. దీంతో తన సినిమా ప్రచారాన్ని అక్కడా చేయబోతున్నాడు. దీనికోసం పెద్ద కసరత్తే చేశాడు. తక్కువ వ్యవధిలో ఎక్కువ మందికి చేరేలా చేయడానికి.. సూపర్ స్టార్ మోహన్ లాల్ సాయం తీసుకుంటున్నాడు. కేరళలో భారీ ప్రెస్ మీట్ పెట్టి.. తన సినిమాను ప్రమోట్ చేసుకోనున్నట్టు తెలిసింది. దీనికి మోహన్ లాల్ కూడా అంగీకరించారని తెలిసింది. దీనివెనక బన్నీ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారు. ఆయన సూచనతోనే మోహన్ లాల్‌ను కలిసిన బన్నీ.. ఆయన్ను ప్రెస్ మీట్‌కు ఒప్పించినట్టు టాక్.
మోహన్ లాల్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడిన విషయం తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే.. మరోపక్క తన మలయాళీ సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ.. మార్కెట్‌ను పెంచుకుంటున్నారు ఈ స్టార్ హీరో. తాజాగా బన్నీ రిక్వెస్టును ఆయన అంగీకరించడం వెనక .. బిజినెస్ కోణం కూడా ఉన్నట్టు మార్కెట్ల వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అరవింద్ లాంటి నిర్మాత, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో విన్నపాన్ని అంగీకరించడం ద్వారా.. తన మార్కెట్‌ను తెలుగులో సులభతరం చేసుకోవచ్చనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు విశ్లేషకులు. ఏది ఏమైతేనేమి.. సినీ పరిశ్రమ బాగుండాలంటే.. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు రెండు అడుగులు పడితేనే.. నాలుగు కాసులు పడతాయి.. సినీ జీవులు హాయిగా బతుకుతారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com