ఓపిక పట్టమంటున్న బన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
బన్నీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అటు ట్విట్టర్, ఇటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. ఇటు సినిమాలు, అటు కుటుంబం.. అన్నిటికీ విలువిచ్చి, సమప్రాధాన్యతను ఇచ్చి ముందుకు సాగుతుంటారు అల్లువారి హీరో. అల్లు అర్జున్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` వేసవికి విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా ఉందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
అయితే వాటన్నిటిలో దేన్నీ ఆయన ఆథంటిక్గా చేస్తున్నట్టు చెప్పలేదు. దాంతో ఎందుకు తమ హీరో సినిమా లేట్ అవుతోందని అభిమానుల్లో అలజడి మొదలైంది. వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా బన్నీ ట్విట్టర్లో ఓ విషయాన్ని ప్రకటించారు. `` మంచి సినిమాను అందించాలంటే సమయం పడుతుంది. నిజాయతీగా మంచి సినిమా కోసం ట్రై చేస్తున్నా. కాస్త ఓపిక పట్టండి. నా మీద చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు`` అని అందులో రాశారు. సో ఇప్పుడు తమ హీరో చెప్పడంతో అభిమానులు ఆ ట్వీటుకు లైకులు మీద లైకులు కొడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments