బ‌రువు త‌గ్గుతున్న బ‌న్ని...

  • IndiaGlitz, [Saturday,July 25 2020]

ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్ష‌కుడు కంటెంట్ సినిమాల‌ను ఎక్కువ‌గా ఆదరిస్తున్నారు. దీంతో మ‌న స్టార్స్ దృక్ప‌థం కూడా మారింది. పాత్ర‌కు, క‌థకు అనుగుణంగా త‌మ లుక్‌ను కూడా మార్చుకోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. అందుకు బెట‌ర్ ఎగ్జాంపుల్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌. ఈ ఏడాది సంక్రాంతికి బ‌న్నీ ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంతో నాన్ ‘బాహుబ‌లి’ రికార్డుల‌ను క్రియేట్ చేశారు. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ కుర్రాడిగా క‌న‌ప‌డ‌టానికి బ‌న్నీ కాస్త బ‌రువు కూడా పెరిగారు. లుక్ మార్చుకున్నారు. ఇప్పుడు బ‌న్నీ తన 20వ సినిమా ‘పుష్ప’ కోసం మ‌రోసారి లుక్ మార్చుకున్నారు.

‘అర్య, ఆర్య 2’ త‌ర్వాత టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ‘పుష్ప‌’ చిత్రం మాత్రం ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. . క‌రోనా వైర‌స్ ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈ పాటికే సెట్స్‌లో ఉండాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆగింది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ‘పుష్ప‌’ సినిమా కోసం బన్నీ బరువు తగ్గుతున్నాడట. అందుకోసం కేబీఆర్ పార్కులో ప‌రుగుతీస్తున్నాడ‌ట బ‌న్నీ. ఈ సినిమా కోసం ఏకంగా ఎనిమిది కిలోల బ‌రువు త‌గ్గాడ‌ట బ‌న్నీ. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం శేషాచ‌ల అడ‌వుల్లో జరిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది.

More News

త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన ఆర్జీవీ... నిర్మాత ఘాటు కౌంట‌ర్‌

శ‌నివారం వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన ‘ప‌వ‌ర్‌స్టార్‌’ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

ఓ గ్యాంగ్ నాపై దుష్ప్రచారం చేస్తోంది: ఏ ఆర్ రెహమాన్

ఒక‌ప్పుడు ద‌క్షిణాది,  ఉత్త‌రాది సినీ ప్రేక్ష‌కుల‌కు ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఇండియ‌న్ మ్యూజిషియ‌న్‌. కానీ ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న త‌ర్వాత ప్యాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్ట‌రే కాదు..

అప్పటివరకు అంతా వెయిట్ చేయాల్సిందే: పవన్ కళ్యాణ్

శ్రీ పవన్ కల్యాణ్ గారు నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలోని మరో చిత్రం సెట్స్ మీద ఉన్నాయి.

ఆర్జీవీకి ఉస్మానియా జేఏసీ నేత వార్నింగ్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీసు వద్దకు వెళ్లిన విషయమై ఉస్మానియా జేఏసీ నేత సంపత్ నాయక్ మీడియాతో మాట్లాడారు.

ప్రజల మధ్యే కరోనా బాధితులు.. తెలంగాణలో సర్వం అస్తవ్యస్తం

తెలంగాణ పరిస్థితి సర్వం అస్తవస్త్యంగా మారుతోంది. అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి.