Allu Arjun:ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల వల్ల కానిది.. తెలుగువారి ‘‘జాతీయ ఉత్తమ నటుడు’’ కల తీర్చిన అల్లు అర్జున్
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలోనే అతిపెద్ద చిత్ర పరిశ్రమగా నిలిచినా.. పౌరాణికాలు తెలుగువారిలా తీయ్యడం ఎవ్వరి వల్లా కాదు అని అని అనిపించుకున్నా .. చివరికి ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్ కోరి వరించినా.. టాలీవుడ్‌కు ‘‘జాతీయ ఉత్తమ నటుడు’’ అన్న పురస్కారం మాత్రం అందని ద్రాక్షగానే మారింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తరం నుంచి నేటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల వరకు ఏ సూపర్‌స్టార్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు. కానీ ఈ లోటు తీర్చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
అల్లు అరవింద్ నివాసంలో పండుగ వాతావరణం:
గురువారం ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో భాగంగా పుష్ప ది రైజ్ సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్‌కు ఎంపికవ్వడంతో తెలుగు ప్రజలు పులకించిపోయారు. దశాబ్ధాలుగా మనకు కలగా మారిన విషయాన్ని బన్నీ నిజం చేయడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. అల్లు అరవింద్ నివాసంలో కోలాహలం నెలకొంది. దర్శకుడు సుకుమార్ బన్నీని ఆత్మీయంగా కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యారు. సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు అల్లు అర్జున్‌కు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.
పుష్ప కోసం కంప్లీట్ మేకోవర్ :
స్టైల్‌కు ఐకాన్‌గా నిలిచే అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఎంతో శ్రమించారు. పుష్పరాజు క్యారెక్టర్ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. డీ గ్లామరైజ రోల్లో మేకప్ కోసం గంటల కొద్దీ సమయం వెచ్చించారు. క్రూర మృగాలు సంచరించే దట్టమైన అడవుల్లో కిలోమీటర్ల దూరం నడిచారు. అందుకు తగ్గ ప్రతిఫలం జాతీయ ఉత్తమ నటుడి రూపంలో బన్నీకి దక్కింది. అంతేకాదు.. ఓ వైపు తన సమకాలీకులు రాంచరణ్, ఎన్టీఆర్‌లు ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా సత్తా చాటారు. వారి స్టార్డం సైతం శిఖరాగ్రానికి చేరుకుంది. ఇలాంటి పరిస్ధితుల్లో అల్లు అర్జున్‌కు ఈ పురస్కారం రావడం ద్వారా మరోసారి జాతీయ స్థాయిలో ఆయన పేరు మారుమోగింది. తర్వాత ఎంతోమంది తెలుగు నటులకు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం రావొచ్చు. కానీ దానిని తొలిసారి అందుకున్న చరిత్ర మాత్రం బన్నీదే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout