‘రాములో రాముల’ రికార్డ్ కొట్టిందిరో...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రూపొందించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో..’. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇంకా రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది. సినిమాతో పాటు పాటలు కూడా పాపులర్ అవడంతో ఈ సినిమా ఇప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్‌గానే ఉంది. కథ పాతదే అయినా కూడా దానిని ప్రేక్షకులకు అందించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది.

ఈ సినిమాలోని పాటలు, వాటికి బన్నీ స్టెప్పులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని పాటలు, బన్నీ స్టెప్స్ తెలుగు ప్రేక్షకులనే కాదు దేశవ్యాప్తంగా అందరినీ అలరించాయి. దీంతో ఇప్పటికీ ఈ సినిమా పాటలు రికార్డులు కొల్లగొడతూనే ఉన్నాయి. ఈ సినిమాలోని 'రాములో.. రాముల..' పాట తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ పాట పూర్తి వీడియో ఇప్పటి వరకూ 300 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించి సంచలన రికార్డు నెలకొల్పింది. దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన తొలి పాటగా ‘రాములో రాముల’ నిలిచింది.

More News

యువతిపై అత్యాచారయత్నం.. నిందితులకు చుక్కలు చూపించిన పోలీసులు

హైదరాబాద్‌ శివార్లలో మరో దారుణం.. దిశను గుర్తుకు తెచ్చే ఘటన.. కానీ ఇక్కడ పోలీసులు క్షణాల్లో స్పందించారు.

షర్మిల పార్టీపై స్పందించిన పవన్

షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. ‘షర్మిల ఇంకా పార్టీ స్థాపించలేదు కదా?, పార్టీ విధివిధానాలు వచ్చాక మాట్లాడదాం.

తొక్కిపడేస్తాం జాగ్రత్త.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి: కేసీఆర్ వార్నింగ్

ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా హాలియాలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్

స్లిమ్‌గా మారిపోయిన రాశిఖన్నా.. అభిమానులకో మెసేజ్..

ఇటీవలి కాలంలో బొద్దుగుమ్మలంతా ముద్దుగుమ్మల్లా మారి అభిమానుల ముందుకు వస్తున్నారు. ఎంతో బొద్దుగా ఉండే నమిత..

స్నేహితుడిని కలవడానికి వెళ్తే కొన్ని గంటల్లోనే రూ.కోటి లాటరీ..

ఫేస్‌బుక్ స్నేహానికి అత్యంత విలువ ఇచ్చాడు. కర్ణాటక నుంచి కేరళకు ఫేస్‌బుక్ స్నేహితుడిని కలిసేందుకు వెళ్లాడు.