యాక్షన్‌తో ప్రారంభం కానున్న ‘పుష్ప’
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. ప్యాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో రూపొందుతో్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. త్వరలోనే ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ రివేంజ్ డ్రామాను యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. అందుకోసం ప్లానింగ్ కూడా జరుగుతోందట. సినిమాను కేరళలోని కానీ, మారేడు మల్లి, వికారాబాద్ అటవీ ప్రాంతాల్లో షూటింగ్ చేయాలా? అనే చర్చలు జరుగుతున్నాయట.
శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారని, తన పాత్ర పేరు పుష్పరాజ్ అని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న తరుణంలో కోవిడ్ ప్రభావం ప్రారంభం కావడంతో రెగ్యులర్ షూటింగ్ ఆగింది. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలతో త్వరలోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం బన్నీగడ్డం ఉన్న లుక్‌లో కనిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments